మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల
SPPT: సూర్యాపేట మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వారీగా రూపొందించిన తుది ఓటర్ల జాబితాను అధికారులు ఈరోజు విడుదల చేశారు. ప్రజల సౌకర్యార్థం ఈ జాబితాలను మున్సిపల్ కార్యాలయంతో పాటు కలెక్టరేట్, ఆర్డీవో ఆఫీసుల్లో ప్రదర్శించారు. పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు సిద్ధమవాలని కమిషనర్ హనుమంత్ రెడ్డి సూచించారు. మున్సిపల్ అధికారులు ఉన్నారు.