38 మందికి CMRF చెక్కుల పంపిణీ
ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 38 మంది బాధితులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు రూ.23.55 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు ఆరోగ్య భద్రత కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో అందని సాయం, నేడు ప్రతి నెలా అందుతోందని హర్షం వ్యక్తం చేశారు.