దోమలకు అడ్డాగా పెదవాల్తేరు రైతు బజార్
VSP: పెదవాల్తేరు రైతు బజార్ అధ్వానంగా మారింది. ఎక్కడ చూసినా వ్యర్థాలు పేరుకుపోయి, నిలిచిన నీటితో పరిసరాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. నీటి నిలువలతో దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని వినియోగదారులు మండిపడుతున్నారు. మార్కెట్ ఆవరణలో ఆవుల సంచారంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.