ప్రత్యేక అలంకరణలో దుర్గమ్మ

SKLM: ఎచ్చెర్ల మండలం కుశాలపురంలో వెలసిన శ్రీ దుర్గా మహేశ్వర స్వామి అమ్మవారు శుక్రవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. ఆలయ అర్చకుడు కాశీభట్ల మురళీ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి సుప్రభాత సేవ, పంచామృతాలతో అభిషేకాలు చేశారు. అనంతరం పట్టు వస్త్రాలతో అలకరించి మంగళ హారతులతో విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పరిసర గ్రామాల నుంచి భక్తులు వచ్చారు.