అప్పుల బాధ భరించలేక ఆత్మహత్య
VZM: అప్పుల బాధ భరించలేక ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందిన ఘటన కొత్తవలస శివాజీనగర్‌లో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాల ప్రకారం.. గాయత్రి స్కూల్ సమీపంలో టిఫిన్ కొట్టు పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల ఓ ప్రైవేటు సంస్థ నిర్వాహకులు డబ్బుల కోసం తీవ్ర ఒత్తిడి చేయడంతో బాధను భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.