సైకిల్ పై ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటన
AP: కృష్ణాజిల్లా కంచెర్లవానిపురంలో పల్లెబాట 2.0 కార్యక్రమాన్ని MLA వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. గ్రామంలో సైకిల్‌పై పర్యటిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. 'వాట్సాప్ యువర్ MLA' పేరుతో ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్య ఉన్నా ప్రజలు 9908833636 నంబర్‌ను సంప్రదించవచ్చని సూచించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.