VIDEO: వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం

VIDEO: వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం

MHBD: మరిపెడ పట్టణంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో శిలా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించారు. పాకాల రఘురాం శర్మ ఆధ్వర్యంలో వేద పండితులు ఫల-పుష్పాదివాస కార్యక్రమాన్ని వేదోక్తంగా జరిపి, వేదమంత్రోచ్ఛరణలతో శాస్త్రోక్త విధంగా ప్రతిష్ఠాపన పూర్తి చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.