సైబర్ మోసానికి గురైన మాజీ సర్పంచ్
NLG: బొక్కమంతలపాడు మాజీ సర్పంచ్ పిల్లి రమేష్ సైబర్ మోసానికి గురై రూ.1.10 లక్షలు కోల్పోయారు. యూట్యూబ్‌లో ‘భారత్ ఫెర్టిలైజర్’ ఏజెన్సీతో వచ్చిన లింక్‌ను నమ్మి విడతల వారీగా నగదు చెల్లించారు. ఎంతకీ అనుమతులు రాకపోవడం, అవతలి వైపు నుంచి స్పందన లేకపోవడంతో మోసపోయనని గ్రహించారు. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించగా, గుర్తు తెలియని లింకులను నమ్మవద్దని పోలీసులు పేర్కొన్నారు.