రోడ్డు ప్రమాదంలో టీచర్‌కు తీవ్ర గాయాలు
VZM: గంట్యాడ మండలంలోని కొండ తామరాపల్లి జంక్షన్ వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ తీవ్రంగా గాయపడ్డారు. డీకేపర్తి పంచాయతీ భీమవరం గ్రామానికి చెందిన రాజేశ్వరి ఐసిడిఎస్ సమావేశానికి హాజరై తిరిగి సాయంత్రం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడింది. తీవ్రంగా గాయపడిన రాజేశ్వరిని వైద్య చికిత్సకు ఆసుపత్రికి తరలించారు.