కాళీపట్నంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం

కాళీపట్నంలో ఉచిత కంటి పరీక్ష శిబిరం

W.G: మొగల్తూరు మండలం కాళీపట్నం పడమర గ్రామంలో పంచాయితీలో గురువారం గ్రామ సర్పంచ్ కవురు సావిత్రి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఉచితంగా కంటి పరీక్షల శిబిరం నిర్వహించారు. డాక్టర్ బాలపరమేశ్వరరావు 40 మందికి పరిక్షించగా మందులు అవసరమైన వారికి ఉచితంగా అందజేశారు. ఇందులో పంచాయతీ కార్యదర్శి ఎం సత్యనారాయణ, సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.