అమృత్ భారత్ రైలులో ప్రసవించిన మహిళ

అమృత్ భారత్ రైలులో ప్రసవించిన మహిళ

PPM: ప్రయాణంలో పురిటి నొప్పులు రావడంతో మహిళ రైలులోనే ప్రసవించిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. రాయగడ నుంచి పార్వతీపురం వస్తున్న అమృత్ భారత్ రైలులో ఈ ఘటన జరిగింది. ప్రసవ అనంతరం మహిళను, పసిబిడ్డను బెలాగం రైల్వే స్టేషన్‌ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. కాగా మహిళ 7 నెలల గర్భిణి అని రైల్వే సిబ్బంది తెలిపారు.