మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

మౌలిక వసతుల పనులు పూర్తి చేయాలి: కలెక్టర్

WGL: జిల్లాలోని 10 జూనియర్ కళాశాలల మౌలిక వసతుల పనులను దసరా లోపు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు. 'అమ్మ ఆదర్శ పాఠశాలల అభివృద్ధి'పై సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ పనుల కోసం ప్రభుత్వం రూ.1.36 కోట్లు కేటాయించిందని తెలిపారు. నాణ్యతతో కూడిన పనులు ఉండాలని, పనులను సకాలంలో పూర్తి చేయలని ప్రిన్సిపాల్స్, కమిటీ ఛైర్మన్లను ఆదేశించారు.