కల్వకుర్తిలో వినాయక చవితి సన్నాహాక సమావేశం

NGKL: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని బుధవారం కల్వకుర్తి పట్టణంలోని శుభం ఫంక్షన్ హాలులో సాయంత్రం 4 గంటలకు సన్నాహాక సమావేశం నిర్వహిస్తున్నట్లు స్థానిక ఎస్సై మాధవరెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారులు, వినాయక మండపాల నిర్వాహకులు, ఫీస్ కమిటీ సభ్యులు, హిందూ, ముస్లిం మత పెద్దలు సకాలంలో హాజరై తమ విలువైన అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు.