వ్యవసాయ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష

SRCL: జిల్లాలో ఆయా పంటల సాగుకు సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. జిల్లాలో పంటల సాగు, ఎరువులు, యాజమాన్య పద్ధతులు తదితరు అంశాలపై జిల్లా సమీకృత కార్యాలయం నుంచి వ్యవసాయ శాఖ అధికారులతో కలెక్టర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సాగు విస్తీర్ణం, ఎరువుల గురించి అడిగారు.