సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమం
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని జాగృతి నర్సింగ్ కళాశాలలో ఫస్ట్ ఎయిడ్, సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ నటరాజ్ మాట్లాడుతూ.. ఫస్ట్ ఏడు, సీపీఆర్ ట్రైనింగ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రెటరీ మాస్టర్ ట్రైనర్ బాబుల్ రెడ్డి పాల్గొన్నారు.