రేపు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ

రేపు మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ

BDK: జూలూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామ రైతు వేదిక నందు ఆదివారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అందజేయనున్నట్లు ఎంపీడీవో తాళ్లూరి రవి తెలిపారు. మండల పరిధిలోని బేతలపాడు, అన్నారుపాడు, పాపకొల్లు, మాచినేనిపేట తండా, సాయిరాం తండా, కాకర్ల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని సకాలంలో హాజరు కావాలని సూచించారు.