VIDEO: లారీ ఢీకొని రెండు మూగజీవాలు మృతి

మన్యం: సీతానగరం మండలం కాసయ్యపేట శివారులో లారీ ఢీకొట్టడంతో రెండు ఎద్దులు గురువారం ఉదయం మృతి చెందాయి. జోగింపేటకు చెందిన పోలినాయుడు నాటు బళ్ళు తోలుకుని వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో రెండు ఎద్దులు మృతి చెందాయి. ఎద్దులు మరణించడంతో రైతు లబోదిబోమంటూ విలపిస్తున్నాడు.