'రైతుల ఖాతాలో రూ. 102.84 కోట్లను జమ చేశాం'
MDK: జిల్లాలో ఇప్పటివరకు ఒకటి 1,14,77.960 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రైతుల ఖాతాలో రూ. 102.84 కోట్ల డబ్బులు జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పాపన్నపేట ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్‌తో కలిసి పరిశీలించారు. ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.