రామతీర్థం పుట్టాలమ్మ ఆలయానికి పోటెత్తిన భక్తులు
NDL: ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామతీర్థం పుట్టాలమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పుణ్య స్నానాలు ఆచరించి కార్తిక దీపాలు వెలిగించారు. అనంతరం పుట్టాలమ్మ, పరశురామలింగేశ్వర, శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.