వెంకన్న సన్నిధిలో భజన కోలాహలం
NGKL: బిజినేపల్లి మండలంలోని శ్రీ అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం భజన కార్యక్రమం వైభవంగా జరిగింది. వసంతపూర్ గ్రామ భజన మండలి సభ్యులు భక్తి గీతాలతో స్వామివారిని కీర్తించారు. భజన చేసిన బృందానికి ఆలయ కమిటీ వారు అల్పాహారంతో పాటు ₹2,000 నగదు బహుమతిని అందజేశారు. ప్రతి శనివారం ఈ ఆలయంలో వివిధ గ్రామాల భజన బృందాలతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వహకులు తెలిపారు.