విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
NLR: ఉలవపాడు మండలం పెద్దపట్టపుపాలెంలో గోపి అనే వ్యక్తి విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన రామతీర్థంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గోపి తన భార్యతో కలిసి విడవలూరులోని రొయ్యల చెరువు వద్ద ఏడాదిగా పని చేస్తున్నాడు. మోటర్ మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై మృతి చెందినట్లు పేర్కొన్నారు. తన భార్య ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.