కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా
ASF: సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్ కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం గోలేటి జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. లాభాల వాటా ప్రకటించి కార్మికులకు 35 శాతం చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో రాజకీయ జోక్యం పెరిగిపోతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.