ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
ASF: కౌటాల ప్రభుత్వ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ కె. హరిత మంగళవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, విద్యర్థులకు కల్పించిన వసతులను ఆమె సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా 19 కేంద్రాల్లో పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.