'క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది'

'క్రీడలతో క్రమశిక్షణ అలవడుతుంది'

NZB: క్రీడలతో క్రమశిక్షణ, శారీరక దృఢత్వం అలవడుతుందని జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఛైర్మన్ బస్వా లక్ష్మీ నర్సయ్య అన్నారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని బస్వా గార్డెన్‌లో కలర్ బెల్ట్ ప్రమోషన్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో నేర్చుకోవడంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు.