BREAKING: భారీ అగ్ని ప్రమాదం
TG: సంగారెడ్డిలోని పటాన్‌చెరులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పారిశ్రామికవాడలోని రూప కెమికల్స్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. పరిశ్రమలో పెద్ద మొత్తంలో కెమికల్స్ నిల్వ ఉన్నాయి. మూడు ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పుతున్నారు. అయితే ప్రక్కనే ఉన్న సితార్ ఫ్లోర్ మిల్‌కు మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.