అక్రమంగా తరలిస్తున్న నాటుసారా స్వాధీనం
PPM: అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 200 లీటర్ల నాటుసారను కురుపాం మండలం జోగిరాజుపేట వద్ద ఎక్షైజ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా గస్తీ కాయగా, చినమేరంగి గ్రామానికి తరలిస్తున్న నాటుసారాను పట్టుకున్నామని సీఐ శ్రీనివాసరావు తెలిపారు. చినమేరంగి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశామన్నారు.