రిటైర్‌మెంట్ తర్వాత ఒత్తిడి లేని జీవితం గడపాలి: ఎమ్మెల్యే

రిటైర్‌మెంట్ తర్వాత ఒత్తిడి లేని జీవితం గడపాలి: ఎమ్మెల్యే

KKD: విశ్రాంత ఉద్యోగులు సమాజాన్ని లోతుగా అర్థం చేసుకున్న మేధావులని, వారి అనుభవం సమాజానికి ఎంతో విలువైనదని ప్రత్తిపాడు ఎమ్మెల్యే సత్య ప్రభ రాజా పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు MPDO కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన 'పెన్షనర్స్ డే' వేడుకలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.