డిసెంబర్ 5 నుంచి డిగ్రీ ప్రాక్టికల్ పరీక్షలు
ADB: కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 1, 3, 5 సెమిస్టర్లకి సంబంధించిన ప్రాక్టికల్ పరీక్షల తేదీలను అధికారులు ప్రకటించారు. తమ సొంత కళాశాలల్లో డిసెంబర్ 5 నుంచి 15వ తేదీ వరకు రెగ్యులర్, సప్లిమెంటరీ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించాలన్నారు. విద్యార్థులు తప్పకుండా హాజరు కావాలని ఎగ్జామినేషన్ కంట్రోలర్ రాజేందర్ సూచించారు.