స్టాలిన్ ప్రభుత్వంపై మోదీ మండిపాటు
తమిళనాడు పర్యటనలో భాగంగా స్టాలిన్ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. అవినీతి, కుటుంబ రాజకీయాలను తమిళ ప్రజలు ముమ్మాటికి కోరుకోవడం లేదని చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి డీఎంకే సర్కార్ మోసం చేసిందని ధ్వజమెత్తారు. నదులన్నీ సముద్రంలో కలిసిపోయినట్లే.. రాష్ట్రంలో అవినీతి ధనమంతా ఒకే కుటుంబానికి చేరుతోందని పేర్కొన్నారు.