మంత్రిని కలిసిన ఎండపల్లి మండల సర్పంచులు
JGL: హైదరాబాద్‌లోని సచివాలయంలో ఎండపల్లి మండల సర్పంచులు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మండల అభివృద్ధి, గ్రామ సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, తాగునీరు, రహదారులు, మౌలిక వసతులపై చర్చించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కలిసిన వారిలో మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రావు, మద్దుల గోపాల్ రెడ్డి ఉన్నారు.