కుందుర్పిలో పేకాటపై పోలీసుల దాడి

కుందుర్పిలో  పేకాటపై పోలీసుల దాడి

ATP: జిల్లా ఎస్పీ పీ. జగదీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం కుందుర్పి పోలీసుల దాడిలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశారు. ఎర్రగుంట–చింతలపల్లి రహదారిలోని అటవీ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. వారి వద్ద నుంచి రూ.30,600 వేల నగదు, రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.