'ఓటర్ల జాబితా అవకతవకలపై విచారణ చేయాలి'

W. G: ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత భీమవరం నియోజకవర్గం ఇంఛార్జ్ అంకెం సీతారామ్ భీమవరంలో మంగళవారం మీడియా సమావేశంలో చెప్పారు. దేశవ్యాప్తంగా జరిగిన ఓట్ల అక్రమాలతో 70 స్థానాల్లో ఫలితాలు మారినట్లు తేటతెల్లమైందన్నారు. దీనిని సుప్రీంకోర్టు సుమోటాగా తీసుకోవాలని ఆయన కోరారు.