పాకిస్తాన్ న్యూస్ పేపర్‌పై రష్యా ఫైర్

పాకిస్తాన్ న్యూస్ పేపర్‌పై రష్యా ఫైర్

పాకిస్తాన్‌కు చెందిన 'ది ఫ్రాంటియర్ పోస్ట్' న్యూస్ పేపర్‌పై రష్యా మండిపడింది. రష్యా విదేశాంగ విధానం, అధ్యక్షుడు పుతిన్‌ను విమర్శిస్తూ కథనాలు ప్రచురిస్తూ.. మాస్కోపై వ్యతిరేకతను వ్యాప్తి చేస్తోందని ఆరోపించింది. ఈ పేపర్‌‌లో తమ దేశానికి సానుకూలంగా ఉండే ఒక్క కథనం కూడా రాలేదని, తమ విమర్శకులకు ఇది అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఫైర్ అయింది.