IPL 2026: ప్లే ఆఫ్స్ చేరే జట్లు ఇవే..!
IPL 2026 సీజన్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. లీగ్‌లో ఇప్పటికే 6 మ్యాచ్‌లు పూర్తి కావడంతో, అప్పుడే ప్లే ఆఫ్స్ చేరే జట్లపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ దిగ్గజం పీటర్సన్ టాప్-4 జట్లపై తన అంచనాలను వెల్లడించాడు. MI, DC, RR, PBKS జట్లు ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతాయని జోస్యం చెప్పాడు. ఈ జట్లలో డిఫెండింగ్ ఛాంపియన్ RCBకి చోటు దక్కకపోవడం గమనార్హం.