స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న మంత్రి

విజయనగరం జిల్లా రామతీర్థంలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండపల్లి పాల్గొననున్నట్లు పార్టీ కార్యవర్గ సభ్యులు తెలిపారు. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.