అగ్నిమాపక కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

NGKL: కల్వకుర్తి పట్టణంలోని అగ్నిమాపక కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వేసవిలో అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే 101నంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఆయన అన్నారు. అనంతరం ఎమ్మెల్యేను అగ్నిమాపక సిబ్బంది సన్మానించారు.