కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

కుక్కల దాడిలో బాలుడికి గాయాలు

KDP: పులివెందులలో గురువారం రాత్రి ఓ బాలుడిపై కుక్కలు దాడి చేసి కరిచాయి. పట్టణంలోని స్థానిక నారాయణ కళాశాల వెనుక వైపున వెంకట భరత్(8) అనే బాలుడు సైకిలైపై వెళ్తుండగా కుక్కలు దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వీధి కుక్కలు బాలుడి చేతిని కరవడంతో వెంటనే తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. అధికారులు కుక్కల బెడద లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.