ధాన్యం కుంభకోణం: రైస్ మిల్ యజమానుల అరెస్ట్

ధాన్యం కుంభకోణం: రైస్ మిల్ యజమానుల అరెస్ట్

ASF: ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తూ, నకిలీ పత్రాలతో ఆదాయానికి గండికొట్టిన రైస్ మిల్ యజమానులను అరెస్ట్ చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితిక పంత్ తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను కాజేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమోదు చేశారు.