'డంపింగ్ యార్డులో డిసెంబర్ కల్లా వ్యర్థాలు తొలగించాలి'
CTR: చిత్తూరు నగరపాలక సంస్థ డంపింగ్ యార్డులో పేరుకున్న వ్యర్థాలను డిసెంబర్ కల్లా తొలగించాలని రాష్ట్ర స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కే. పట్టాభిరామ్ అధికారులను ఆదేశించారు. సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్‌తో కలిసి ఛైర్మన్ సంతపేటలోని డంపింగ్ కేంద్రాన్ని పరిశీలించారు.