అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య

GNTR: ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి గ్రామానికి చెందిన కౌలు రైతు షేక్ మస్తాన్ వలి (69) పంటలలో తీవ్ర నష్టాలు రావడంతో రూ.15 లక్షల అప్పులు అయ్యింది. అప్పులు తీర్చే మార్గం లేక గురువారం పొలంలో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫిరంగిపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.