జిల్లాలో 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 1683 గ్రామ పంచాయతీలకు, 14,776 వార్డులకు మూడు దశల్లో ఎన్నికలను నిర్వహించనున్నారు. మొదటి దశలో 555 జీపీలు, 4,952 వార్డులకు ఎన్నికలు జరగనుండగా. రెండో దశలో 564 జీపీలు, 4,928 వార్డులకు జరగనున్నాయి. మూడో దశలో 564 జీపీలకు, 4,896 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు.