కొనుగోలు కేంద్రాలకు ముహూర్తాలు ఎప్పుడో..?

కొనుగోలు కేంద్రాలకు ముహూర్తాలు ఎప్పుడో..?

BHNG: బొమ్మలరామారం మండలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. వరి కోతలు పూర్తిచేసి కొనుగోలు కేంద్రాలలో ధాన్యం కుప్పలు పోసిన రైతులు కొనుగోలు కోసం పడిగాపులు కాస్తున్నారు. 15 రోజుల నుంచి ధాన్యం కుప్పలు పోసిన రైతులు వాటిని కాపలా కాసేందుకు ధాన్యం తడవకుండా పట్టాలు కప్పుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.