కుంగిన బోనకల్ ప్రధాన రహదారి..!

KMM: ఖమ్మం నుంచి బోనకల్ వెళ్లే ప్రధాన రహదారి మార్గంలోని ధ్వంసలాపురం- రామకృష్ణాపురం మధ్యలో గల వాగు వద్ద రోడ్డు కుంగిందని స్థానికులు తెలిపారు. పొంగిన రోడ్డును గమనించకుండా వాహనాలు అలానే వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి ప్రమాదం జరగకముందే తగు చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానికులు కోరారు.