ఓయూలో ఈనెల 13న నిర్వహించాల్సిన బీసీఏ పరీక్ష వాయిదా

ఓయూలో ఈనెల 13న నిర్వహించాల్సిన బీసీఏ పరీక్ష వాయిదా

HYD: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 13న నిర్వహించనున్న బీసీఏ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. అదే రోజు పాలీసెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేసినట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహించనున్నట్లు వివరించారు.