VIDEO: 'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

VIDEO: 'పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి'

కోనసీమ: తుఫాన్‌లు కారణంగా పంటలు నష్ట పోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర నాయకులు దేవ రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. బుధవారం ఆయన రైతులతో కలిసి తాటిపాక మార్కెట్ యార్డ్ వద్ద ఉన్న తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. రైతు కష్టపడి భారీ పెట్టుబడులు పెట్టి పండిస్తుంటే ప్రకృతి వైపరీత్యాలు వల్ల రైతులు నష్టాలు పాలవుతున్నారన్నారు.