రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

NLR: రోడ్డు దాటుతున్న యువకుడిని గుర్తు తెలియని కారు ఢీకొన్న ఘటన మనుబోలు మండల కేంద్రంలోని సంజీవయ్యకాలనీ వద్ద జాతీయ రహదారిపై గురువారం రాత్రి చోటుచేసుకొంది. పోలీసుల వివరాల మేరకు నెల్లూరుకు చెందిన పాతేపి రాజేష్(35) రోడ్డు దాటుతుండగా నెల్లూరు నుంచి గూడూరు వైపు వెళుతున్న కారు ఢీకొంది. ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.