వరి నారును కాపాడేందుకు భగీరథ ప్రయత్నం
SDPT: నంగునూర్ మండలంలో వరి నారును కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అడవి పందులు, కోతులు, పశువులు వరి నారుపై పడి నాశనం చేస్తుండటంతో, వాటి నుంచి రక్షణ కల్పించేందుకు రైతులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. నారు చుట్టూ కర్రలు పాతి,వాటిపై తీగలు చుట్టి ఒక రక్షణ కవచాన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు, చలి తీవ్రత కారణంగా నారులో ఎదుగుదల కనిపించడం లేదన్నారు.