గురపు డెక్కలతో దోమల బెడద.. ప్రజల ఆరోగ్యంపై ముప్పు

గురపు డెక్కలతో దోమల బెడద.. ప్రజల ఆరోగ్యంపై ముప్పు

MDCL: రాంపల్లి చెరువులో ఏర్పడిన గురపు డెక్కల కారణంగా భరత్ నగర్, అరుంధతి కాలనీ, లక్ష్మి నగర్ కాలనీల్లో దోమల సమస్య తీవ్రంగా మారింది. ప్రజల ఆరోగ్యానికి ముప్పు ఉన్నప్పటికీ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే చెరువు శుద్ధి, దోమల నివారణ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు.