కూటమి అభ్యర్థులను గెలిపించండి: మాజీ మంత్రి

విశాఖ: అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ ని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపించాలని కుటమి ఎమ్మెల్యే అభ్యర్థి,మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రజలను కోరారు. ఈ మేరకు మండలంలో కొత్తమల్లంపేట గ్రామంలో జరిగిన శంఖారావం సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీని ఇంటికి పంపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.