'జిల్లా వ్యాప్తంగా 288 సైబర్ క్రైమ్ కేసులు నమోదు'

'జిల్లా వ్యాప్తంగా 288 సైబర్ క్రైమ్ కేసులు నమోదు'

ASF: జిల్లా వ్యాప్తంగా 288 సైబర్ క్రైమ్ కేసులు నమోదు కాగా 33 FIR లు చేసినట్లు SP కాంతిలాల్ పాటిల్ ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఇందులో పోలీసులు 6 కేసులను చేధించి 11 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామన్నారు. జిల్లాలో ఈ ఏడాది రూ.1.96కోట్లు సైబర్ మోసగాళ్లు కాజేశారని, వాటిలో రూ.14.77 లక్షలను నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఫ్రీజ్ చేశామని వెల్లడించారు.